22 facts of 2022 | మరికొన్ని గంటల్లో కొత్త ఏడాది ప్రారంభం కానున్నది. 2022లో మనం ఎన్నో సంతోషాలను.. మరెన్నో బాధలను చవిచూశాం. కొవిడ్ నుంచి కొంత ఉపశమనం పొందినా.. ఏడాది చివర్లో మళ్లి వ్యాప్తిచెందుతూ కలవరానికి గురిచేసింది. 2022 లో ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల మంది చిన్నారులు జన్మించగా.. 6.5 కోట్ల మందికి పైగా మరణించారు. 8 కోట్ల కార్లు తయారయ్యాయి. 27 లక్షలకు పైగా పుస్తకాలు ముద్రించబడ్డాయి. ఇలాంటి 22 వాస్తవాలను మరోసారి పరిశీలిద్దాం.
ఫ్యాక్ట్ 1
ప్రపంచంలో పుట్టిన 13 కోట్ల మంది పిల్లల్లో దాదాపు 2.50 కోట్ల మంది పిల్లలు భారతదేశంలోనే పుడుతున్నారు. జనాభా పెరుగుదల రేటు ఇలాగే కొనసాగితే.. 2023 ఏప్రిల్ 14 నాటికి మన దేశ జనాభా చైనా కంటే ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
ఫ్యాక్ట్ 2
దేశంలో స్థూలకాయంతో బాధపడుతున్న యువకుల సంఖ్య పెరుగుతున్నది. ఈ విషయంలో మన దేశం ర్యాంకింగ్ 187. ఇక్కడ 3.9 శాతం మంది యువకులు ఊబకాయంతో బాధపడుతున్నారు. వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ ప్రకారం, 2030 నాటికి ప్రపంచంలోని ప్రతి 5 మంది మహిళల్లో ఒకరు, ప్రతి 7 మంది పురుషుల్లో ఒకరు ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడతారు.
ఫ్యాక్ట్ 3
ఇంత అభివృద్ధి చెందుతున్నా ఎందరో ఇంకా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. యెమెన్‌లో అత్యధికంగా 45 శాతం జనాభా పోషకాహార లోపం, ఆకలితో బాధపడుతున్నారు. రెండో స్థానంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉన్నది. ఇక్కడి జనాభాలో 44 శాతం మంది పోషకాహార లోపంతో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ‘ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2022’ ప్రకారం మన దేశంలో 2.2 కోట్లకు పైగా ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
ఫ్యాక్ట్ 4
టయోటా ప్రపంచంలో అత్యధికంగా కోటి కార్లను తయారు చేసింది. వోక్స్వ్యాగన్ దాదాపు 82 లక్షలతో రెండో స్థానంలో ఉన్నది. మారుతీ సుజుకి గత 5 ఏండ్లుగా భారతీయ మార్కెట్లో అతిపెద్ద కంపెనీ అయినప్పటికీ.. 16 లక్షలకు పైగా కార్లను మాత్రమే తయారు చేసింది.
ఫ్యాక్ట్ 5
జెయింట్.. ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్ తయారీ, విక్రయ సంస్థ. ఈ సంస్థ ప్రతి ఏటా 70 లక్షలకు పైగా సైకిళ్లను తయారు చేస్తున్నది. హీరో కంపెనీ భారతదేశంలో గరిష్టంగా 40 శాతం సైకిళ్లను విక్రయిస్తున్నది. హీరో సంసథ ఏటా మన దేశంలో 50 లక్షల సైకిళ్లను తయారు చేస్తుంది.
ఫ్యాక్ట్ 6
RELX గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిషింగ్ హౌస్. ఇది ఏటా 4.20 లక్షల కంటే ఎక్కువ పుస్తకాలను ప్రచురిస్తున్నది. బుక్ మార్కెట్ 2016 ప్రకారం, అన్ని రకాల పుస్తకాలను ప్రచురించడంలో మన దేశం ప్రపంచంలో ఆరో స్థానంలో ఉన్నది. ఆంగ్ల పుస్తకాలను ప్రచురించడంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నది. ఇక్కడ రోజుకు సగటున 250 పుస్తకాలు ముద్రిస్తున్నారు.
ఫ్యాక్ట్ 7
ఐక్యరాజ్య సమితి ప్రకారం, బ్రెజిల్‌లోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ఎక్కువ మొత్తంలో అటవీ నిర్మూలన జరిగింది. ఈ ఏడాది మొత్తం 48 లక్షల ఎకరాల్లో అమెజాన్ అడవుల్లో మొక్కలు పెరిగాయి. మరోవైపు, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ 2022 నివేదిక ప్రకారం, 2021తో పోలిస్తే 2022లో అటవీ విస్తీర్ణం 1540 చదరపు కిలోమీటర్లు పెరిగింది.
ఫ్యాక్ట్ 8
చైనా ఏటా సగటున 1,000 టన్నుల కార్బన్‌ను ఉత్పత్తి చేస్తున్నది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ జాబితాలో 541 టన్నుల కార్బన్‌తో అమెరికా రెండో స్థానంలో, 265 టన్నుల కార్బన్‌తో భారత్ మూడో స్థానంలో నిలిచాయి.
ఫ్యాక్ట్ 9
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 కోట్ల స్విమ్మింగ్ పూల్స్ తాగునీటిని ఉపయోగించాయి. మద్యం తయారీలో కాకుండా ఇతర గృహావసరాల్లో కూడా నీటిని ఉపయోగిస్తారు. చైనాలో గరిష్టంగా 362 లక్షల కోట్ల గ్యాలన్ల నీరు, అమెరికాలో 216 లక్షల కోట్ల గ్యాలన్ల నీరు వినియోగిస్తున్నారు. భారతదేశంలో ఏటా దాదాపు 40 లక్షల కోట్ల గ్యాలన్ల నీరు ఉపయోగిస్తున్నారు.
ఫ్యాక్ట్ 10
ప్రపంచవ్యాప్తంగా చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలుగా ఈ ఆరింటిని ఉపయోగిస్తున్నారు. వీటిలో గంజాయి, కొకైన్, నల్లమందు, MDMA, ట్రాంక్విలైజర్లు, బాన్ఫిక్స్, కోడైన్ వంటి స్నఫ్ నార్కోటిక్స్ ఉన్నాయి. వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ 2021 ప్రకారం, హెరాయిన్ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఫ్యాక్ట్ 11
లెనోవో ప్రపంచంలోనే అతిపెద్ద పర్సనల్ కంప్యూటర్ మేకర్‌గా ఉన్నది. ఇది ఏటా 20 లక్షల కంటే ఎక్కువ సిస్టమ్‌లను తయారు చేస్తుననది. కాగా, HP రెండవ స్థానంలో ఉన్నది. ఇది ఏటా 18 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ కంప్యూటర్లను ఉత్పత్తి చేస్తున్నది. ఈ జాబితాలో టాప్-10లో ఏ భారతీయ కంపెనీ కూడా లేదు.
ఫ్యాక్ట్ 12
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ వినియోగదారులను చైనా కలిగి ఉన్నది. ఇక్కడ 102 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. మన దేశంలో 65 కోట్ల మందికి పైగా ప్రజలు ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. IPL, CoWIN, FIFA వరల్డ్ కప్, ఆసియా కప్, ICC టీ-20 వరల్డ్ కప్ వంటి వాటిని 2022 లో మన దేశంలో ఎక్కువ మంది సెర్చ్ చేశారు.
ఫ్యాక్ట్ 13
ప్రపంచంలో అతిపెద్ద US స్టాక్ ఎక్స్ఛేంజ్ NYSE. డిసెంబర్ 2022లో NYSE మార్కెట్ క్యాప్ రూ. 1821 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉన్నది. కాగా, భారత స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాప్ రూ.281 లక్షల కోట్లకు పైగా ఉన్నది.
ఫ్యాక్ట్ 14
చైనాలో గరిష్ఠంగా 9 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వృథా అయ్యాయి. ఆహార ధాన్యాల వృథాలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నది. ఇక్కడ 2022 లో 6 కోట్ల టన్నులకు పైగా ఆహార ధాన్యాలు వృథా అయ్యాయి.
ఫ్యాక్ట్ 15
స్టాటిస్టా వెబ్సైట్ ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు భారత్‌లో జరిగాయి. 2022లో ఇక్కడ 7,000 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలు జరిగాయి. 2000 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలతో రెండో స్థానంలో చైనా ఉన్నది.
ఫ్యాక్ట్ 16
చైనా గరిష్టంగా 394 కోట్ల టన్నులకు పైగా బొగ్గును వెలికితీసింది. 760 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును వెలికితీసి ఈ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉన్నది.
ఫ్యాక్ట్ 17
మరణాల రేటులో సెర్బియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. 2022 లో ప్రతి వేయి మందికి 16 మరణాలు సంభవించాయి. ఈ జాబితాలో భారత్ 31వ స్థానంలో ఉన్నది. ఈ ఏడాది మన దేశంలో ప్రతి వేయి మందికి సగటున 10 మంది మరణించారు.
ఫ్యాక్ట్ 18
మంగోలియాలో ఎక్కువ మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. ఇక్కడ ప్రతి లక్ష మందికి 175 మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నట్లు అక్కడి గణాంకాలు చెప్తున్నాయి. భారతదేశంలో ప్రతి లక్ష మందికి 62 మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంటర్నేషనల్ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఫ్యాక్ట్ 19
ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలలో దక్షిణ కొరియా అత్యధిక ఆత్మహత్య రేటును కలిగి ఉన్నది. ఇక్కడ గతేడాది ప్రతి లక్ష మందిలో 26 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. భారతదేశంలో ప్రతి లక్ష మందిలో 12 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్సీఆర్బీ ప్రకారం, భారతదేశంలో గతేడాది 1.64 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు.
ఫ్యాక్ట్ 20
మలేరియాతో మరణిస్తున్న వారిలో 31 శాతం మంది నైజీరియాకు చెందినవారు. ఈ వ్యాధితో మరణించిన వారిలో 52 శాతం మంది నాలుగు ఆఫ్రికన్ దేశాలైన నైజీరియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, నైజర్కు చెందినవారు. మన దేశంలో దాదాపు 75 మంది మలేరియాతో మరణించారు.
ఫ్యాక్ట్ 21
సిగరెట్ స్మోకింగ్ కారణంగా ప్రపంచంలోనే అత్యధిక మరణాలు గ్రీన్లాండ్లో సంభవించాయి. ఇక్కడ మొత్తం మరణాలలో 26 శాతం స్మోకింగే కారణం. భారతదేశంలో ప్రతి ఏటా 3.5 లక్షల మంది చనిపోతున్నారు. అమెరికాలో ఈ సంఖ్య దాదాపు 4.8 లక్షలు.
ఫ్యాక్ట్ 22
డొమినికన్ రిపబ్లిక్లో ప్రతి లక్ష మందిలో 67 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. భారతదేశంలో ప్రతి లక్షకు 13 మంది చనిపోతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. వరల్డ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ తన నివేదికలో ఈ సమాచారాన్ని ఇచ్చింది. గత దశాబ్ద కాలంలో 14 లక్షల మంది భారతీయులు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు.