ఆదివారం 29 మార్చి 2020
International - Mar 25, 2020 , 11:28:45

కాబూల్‌లో గుర‌ద్వారాపై దాడి నలుగురు మృతి

కాబూల్‌లో గుర‌ద్వారాపై దాడి నలుగురు మృతి

ఆఫ్గ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌లో బుధ‌వారం ఓఉగ్ర‌వాది విచ‌క్ష‌ణార‌హితంగా జ‌రిపిన కాల్పుల్లో న‌లుగురు సిక్కులు మ‌ర‌ణించారు. స్త‌నిక గురుద్వారాలో ప్రార్థ‌న‌ల కోసం గుమికూడిన సిక్కుల‌పై ఆగంత‌కుడు కాల్పుల‌కు తెగ‌బ‌డిన‌ట్లు ఆఫ్గాన్ పార్ల‌మెంటు స‌భ్యుడు న‌రింద‌ర్‌సింగ్ ఖ‌ల్సా తెలిపారు. దాడి జ‌రిగిన‌ప్ప‌డు తాను గురుద్వారా స‌మీపంలోనే ఉన్నాన‌ని, స‌మాచారం తెలిసిన వెంట‌నే అక్క‌డికి చేరుకున్నాన‌ని తెలిపారు. కాల్పులు ఇంకా కొన‌సాగుతున్నాయ‌ని పేర్కొన్నారు. ఆఫ్గాన్‌లో సిక్కులు మైనారిటీ వ‌ర్గం. వీరిపై త‌రుచూ ఉగ్ర‌వాద మూక‌లు దాడుల‌కు తెగ‌బ‌డుతున్నాయి. అయితే ఈ దాడికి ఏ ఉగ్ర‌వాద సంస్థా ఇప్ప‌టివ‌ర‌కు బాధ్య‌త వ‌హించ‌లేదు. హిందువులు, సిక్కుల వంటి మైనారిటీల‌పై ఉగ్ర‌దాడులు పెరుగుతుండ‌టంతో ఆయా వ‌ర్గాలు భార‌త్‌లో ఆశ్ర‌యం కోరుతున్నాయి. 


logo