Open Fire | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బొగ్గు గని (coal mine)లోకి ప్రవేశించిన సాయుధుడు అక్కడి ఉద్యోగుపై విచక్షణా రహితంగా కాల్పులు (Open Fire) జరిపాడు. ఈ ఘటనలో 20 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు.
బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రావిన్స్‌లోని దికీ జిల్లాలో గల ఓ బొగ్గు గనిలోని వసతి గృహాల్లోకి గురువారం రాత్రి సాయుధులు ప్రవేశించారు. గనిలోని ఉద్యోగులను చుట్టుముట్టి వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడ్డారు. మరణించిన వారిలో ఎక్కువ మంది బలూచిస్థాన్‌లోని పష్తున్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన వారిగా పేర్కొన్నారు.
కాగా, గత వారం కరాచీ విమానాశ్రయానికి సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు చైనీయులతోపాటు పాకిస్థానీ మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. వచ్చే వారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ( Shanghai Cooperation Organisation) శిఖరాగ్ర సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో అక్కడ వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.
Also Read..
Israel Strike | బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడి.. 22 మంది మృత్యువాత
Exhibition Grounds | ఎగ్జిబిషన్ మైదానంలో దుర్గా మాత విగ్రహం ధ్వంసం..
Panthangi Toll Plaza | పట్నం జనం పల్లెబాట.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ