Battery Plant | దక్షిణ కొరియా (South Korea)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లిథియం బ్యాటరీ తయారీ కేంద్రం (lithium battery manufacturing plant)లో భారీ అగ్నిప్రమాదం (fire breaks) సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
రాజధాని సియోల్‌కు దక్షిణంగా హ్వాసోంగ్ ( Hwaseong)లో ఉన్న లిథియం బ్యాటరీ తయాకీ కేంద్రంలో సోమవారం ఉదయం 10:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మంటలు చెలరేగినట్లు యోన్హాప్ వార్తా సంస్థ నివేదించింది. దాదాపు 35 వేల యూనిట్లు ఉన్న గిడ్డంగిలో బ్యాటరీ సెల్స్ వరుస పేలడంతో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక అధికారి కిమ్ జిన్-యంగ్ తెలిపినట్లు సంస్థ పేర్కొంది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 20 మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపింది. తీవ్రంగా గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నివేదించింది.
Also Read..
Gujarat | ఇన్‌స్టా రీల్స్ పిచ్చి.. థార్ వాహనాలతో సముద్రంలోకి వెళ్లిన యువకులు.. తర్వాత ఏమైందంటే..?
Lok Sabha | లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేసిన తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులు