బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 09, 2020 , 15:08:07

గ్రహణమొర్రి కుక్కపిల్లను చూసి మురిసిపోయిన బాలుడు! ఎందుకో తెలుసా?

గ్రహణమొర్రి కుక్కపిల్లను చూసి మురిసిపోయిన బాలుడు! ఎందుకో తెలుసా?

మిచిగాన్: ఏదైనా లోపంతో పుట్టిన పిల్లలు తమలాంటి లోపం ఉన్నవారు కనిపించినప్పుడు కొంచెం కుదుటపడుతారు. వాళ్లతో స్నేహం చేస్తూ వైకల్యాన్ని మరిచిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఈ మర్మం తెలిసిన ఓ తండ్రి గ్రహణమొర్రితో బాధపడుతున్న తన కొడుకుకి అలాంటి వైకల్యంతో ఉన్న కుక్కపిల్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ పప్పీని చూసి బాలుడి ఆనందానికి అవధుల్లేవు. 

అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన బెంట్లీకి గ్రహణమొర్రి ఉంది. శస్త్రచికిత్స చేయించగా, పెదవి చీలిక కొంత మేర పోయినా.. గుర్తులు అలానే ఉన్నాయి. అతడి ముఖంలో ఆనందం చూడాలని ఆలోచించిన అతడి తండ్రి యానిమల్‌ షెల్టర్స్‌ అన్నీ తిరిగి మరీ గ్రహణమొర్రి ఉన్న కుక్కపిల్లను వెదికిపట్టుకున్నాడు. దాన్ని దత్తత తీసుకొని కొడుకుకు బహుమతిగా ఇచ్చాడు. ఇంకేం తనలాంటి వైకల్యమున్న కుక్కపిల్లను చూసిన బాలుడు మురిసిపోయాడు. ఇక తను ఒంటరి కాదని, తనకు తోడుగా తనలాంటి మరో స్నేహితుడు ఉన్నాడని బెంట్లీ భావిస్తున్నాడని అతడి తల్లి పేర్కొంది. కుక్కపిల్లను పట్టుకుని బాలుడు సంబురపడిపోతున్న ఫొటోలు నెటిజన్ల మనసు గెలుచుకున్నాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo