బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్సులో భూకంపం సంభవించింది. దీంతో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున సిచువాన్ ప్రావిన్సులోని జిజుజాగౌలో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైందని చైనా ఎర్తక్వేక్ నెట్ వర్క్ సెంటర్ తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించింది. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
దీనిప్రభావంతో చాంగ్కింగ్ మెగాసిటీకి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్జియన్ కౌంటీపై కూడా పడిందని తెలిపింది. ఈ భూకంపం వల్ల సిచువాన్ కౌంటీలో 22 ఇండ్లు కూలిపోయాయని లక్సియన్ అధికారులు చెప్పారు. కాగా, 2008లో సిచువాన్ ప్రావిన్స్‌లో 7.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీనివల్ల 87 వేల మంది చనిపోవడంకానీ, తప్పిపోవడం కాని జరిగింది.