బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 30, 2020 , 22:38:54

పాకిస్థాన్, ఆఫ్ఘన్ బలగాల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి

పాకిస్థాన్, ఆఫ్ఘన్ బలగాల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి

కాందాహార్‌ : ఆప్ఘనిస్తాన్‌  కాందాహర్ ప్రావిన్స్‌లోని స్పిన్ బోల్డక్‌లో గురువారం పాకిస్థాన్, ఆఫ్ఘన్ బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో కనీసం ఇద్దరు మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. స్పిన్ బోల్డక్‌లో పాకిస్థాన్, ఆఫ్ఘాన్ బలగాలు ఘర్షణకు దిగాయి. ఆఫ్ఘన్ వైపు కనీసం ఇద్దరు పౌరులు మరణించారని కాందాహార్ ప్రావిన్సులోని వర్గాల ద్వారా తెలిసిందని ఆఫ్ఘన్‌కు చెందిన జర్నలిస్టు బిలాల్ సర్వారి ట్వీట్ చేశారు. మొదట పాక్ దళాలు నిరసనకారులపై కాల్పులు జరపడంతో నిరసనకారులు, పాక్ దళాలపై ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో కనీసం ఇద్దరు మృతి చెందగా మరో 21 మంది పౌరులు గాయపడ్డారు. ప్రస్తుతం ఆఫ్ఘన్, పాకిస్తాన్ దళాల మధ్య పెద్ద ఎత్తున్న కాల్పులు జరుగుతున్నట్లు స్పిన్ బోల్డక్‌లోని ఓ పెద్ద గిరిజన వ్యాపారి తనకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. 


logo