డెయిర్ అల్-బలాహ్, సెప్టెంబర్ 10: గాజాలోని ఓ రక్షణ గుడారంపై మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 19 మంది చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఆ గుడారంలో తల దాచుకున్న హమాస్ ఉగ్రవాదులను ఏరివేయడం కోసమే గురి చూసి ఆయుధాలతో దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. మృతుల సంఖ్యపై విభేదించింది. ఇజ్రాయెల్ ప్రకటనను హమాస్ ఖండించింది.