Buildings Collapse | నార్త్ ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటైన ఫెజ్ (Fez)లో నాలుగు అంతస్తులు ఉన్న రెండు నివాస భవనాలు కుప్పకూలిపోయాయి (Buildings Collapse). ఈ ఘటనలో 20 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. అల్-ముస్తాక్బాల్ (Al-Mustaqbal neighbourhood) పరిసరాల్లో పక్క పక్కనే ఉన్న రెండు నాలుగు అంతస్తుల భవనాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ భవనాల్లో ఎనిమిది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 19 మంది ప్రాణాలు కోల్పోగా.. 16 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ భవనాలు చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురయ్యాయని అధికారులు తెలిపారు.
Also Read..
Saudi Arabia | ఎడారి దేశం సౌదీ అరేబియాను ముంచెత్తిన వరదలు.. VIDEOS
Maria Corina Machado | నేడే నోబెల్ పురస్కార ప్రదానోత్సవం.. మచాడో హాజరవుతారా..?
Donald Trump | భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపా.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట