ఒట్టావా: కెనడా జనాభాలో దాదాపు 23 శాతం మంది వలసదారులే ఉన్నారు. కొత్తగా వస్తున్న వలసదారుల్లో ఆసియా దేశాలకు చెందిన వారు 62% మంది ఉంటున్నారని, వీరిలో భారతీయులే అధికమని కెనడా గణాంక సంస్థ సెన్సస్ రిపోర్టు-2021లో పేర్కొన్నది. భారత్ 18.6 శాతంతో మొదటి స్థానంలో ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో ఫిలిప్పీన్స్(11.4%), చైనా(8.9%) ఉన్నాయి.
2021లో కెనడా జనాభాలో 83 లక్షల మంది వలసదారులున్నారు. 2041 నాటికి ఈ సంఖ్య 34 శాతానికి పెరుగుతుందని స్టాటిస్టిక్స్ కెనడా అంచనా వేసింది. లేబర్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఆ దేశానికి వలసలు పెరిగాయని విశ్లేషణలు వస్తున్నాయి.