Venezuela | వెనెజులాలో (Venezuela) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 17 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. వెనెజులాలోని ఓ హైవేపై బుధవారం ఈ ప్రమాదం సంభవించింది. ముందుగా ఓ ట్రక్కు అతివేగంగా వెళ్తూ అనేక కార్లను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఓ బస్సు, పలు కార్లు సహా మొత్తం 17 వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
Parliament Breach | సభలో భద్రతా వైఫల్యంపై అమిత్ షా వివరణ ఇవ్వాలి : విపక్షాల డిమాండ్
Parliament Breach | కలర్ స్మోక్ ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్.. ఉభయ సభలు వాయిదా
Ind Vs SA T20 | జోరుమిదున్న సఫరీలు.. మరో కీలకపోరుకు సిద్ధమైన భారత్