ఇస్లామాబాద్: ‘మీ పెరట్లో పాములను పెంచుతూ, పొరుగువారిని మాత్రమే అవి కాటేయాలని ఎంతమాత్రం ఆశించకండి. ఎందుకంటే వాటికి పాలుపోసి పెంచుతున్న మిమ్మల్ని కూడా ఆ సర్పాలు అంతిమంగా కాటేస్తాయి’ అని పాకిస్థాన్‌ను ఉద్దేశించి 2011లో అప్పటి యూఎస్ సెక్రటరీ హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలను నిజం చేస్తూ ఇన్నాళ్లు తాము పెంచి పోషించిన అఫ్గానిస్థాన్ తాలిబన్లు ఇప్పుడు పాకిస్థాన్‌పై దండెత్తి వస్తున్నారు.
సుమారు 15 వేల మంది తాలిబన్ ఫైటర్లు పాకిస్థాన్ సరిహద్దుల వైపు కదులుతున్నట్టు వార్తాకథనాలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్లు హెచ్చరించారు. దీంతో పాక్‌కు తాలిబన్ల నుంచి ముప్పు పొంచి ఉంది.