Pakistan | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో సైనిక కాన్వాయ్ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి (suicide attack) జరిగింది. ఈ దాడిలో 13 మంది సైనికులు మరణించినట్లు ప్రముఖ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ వెల్లడించింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa province)-ఆప్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగినట్లు పేర్కొంది.
‘ఒక ఆత్మాహుతి బాంబు పేలుడు పదార్థాలు నిండిన వాహనం సైనిక కాన్వాయ్‌పైకి దసుకెళ్లింది. ఈ పేలుడులో 13 మంది పాక్ సైనికులు మరణించారు. 10 మంది సిబ్బంది, 19 మంది పౌరులు గాయపడ్డారు’ అని పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్థాన్ (Waziristan) జిల్లా ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడికి ఇప్పటి వరకూ ఏ గ్రూపూ బాధ్యత వహించలేదు. అయితే, ఇటీవలే ఈ ప్రాంతంలో తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ సైనికులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోంది.
Also Read..
Plane Crash | నిఘా వర్గాల హెచ్చరిక.. విమాన ప్రమాద దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీ భద్రత
Maoists | ఛత్తీస్‌గఢ్‌లో 13 మంది మావోయిస్టుల లొంగుబాటు