Palestine rally | గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ప్రణాళికకు వ్యతిరేకంగా దాయాది పాకిస్థాన్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇస్లామిక్ సంస్థ తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్ (Tehreek-i-Labbaik Pakistan) కార్యకర్తలు గురువారం నుంచి పాక్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు (Riots In Pakistan) కొనసాగిస్తున్నారు. వారు చేస్తున్న ఆందోళనలను హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి.
నిరసనకారులు రాజధాని లాహోర్ (Lahore)లో పాలస్తీనా అనుకూల ర్యాలీ (Palestine rally) నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే రాజధాని వైపు కవాతు చేస్తుండగా భద్రతా దళాలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసనకారులపై పంజాబ్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది టీఎల్పీ కార్యకర్తలు మరణించగా.. సుమారు 50 మందికిపైగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రులకు తీసుకువెళ్తే వైద్యం చేయడానికి కూడా అక్కడి వైద్యులు నిరాకరించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ‘ఈ అల్లర్లలో పంజాబ్ పోలీసులు 11 మంది కార్యకర్తలను హత్య చేశారు’ అని తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్ చీఫ్ సాద్ రిజ్వి ఆరోపించారు.
Also Read..
Suicide Attack | పోలీసు శిక్షణా కేంద్రంపై ఆత్మాహుతి దాడి.. ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి
Donald Trump | ఆ బహుమతి నాకు ఇవ్వమని అడగలేదు.. నోబెల్ శాంతి దక్కకపోవడంపై ట్రంప్ స్పందన
Trump Tariffs | చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు.. ప్రకటించిన ట్రంప్