బీరుట్ : సిరియా భద్రతా దళాలు, పదవీచ్యుతుడైన దేశాధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ విధేయుల మధ్య రెండు రోజుల పాటు జరిగిన ఘర్షణలు, ప్రతీకార హత్యల్లో వెయ్యి మందికి పైగా మరణించారు. యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్న సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఈ వివరాలను శనివారం వెల్లడించింది. సిరియాలో పెద్ద ఎత్తున జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఇదొకటని తెలిపింది. కాల్పుల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. 745 మంది పౌరులు, అస్సాద్‌కు అనుబంధంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థకు చెందిన 148 మంది, ప్రభుత్వ బలగాలకు చెందినవారు 125 మంది మరణించారని చెప్పింది.