వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో ఒక బాలుడి కడుపు లోంచి 100 అయస్కాంతాలను (Magnets) డాక్టర్లు శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. 13 ఏండ్ల ఆ బాలుడు వాటిని ఆన్లైన్లో కొనుగోలు చేసి మింగినట్టు గుర్తించారు. ఆగకుండా కడుపులో నొప్పి రావడంతో ఆ బాలుడిని దవాఖానకి తరలించారు. ఎక్స్‌రే తీసి చూడగా, అతని కడుపులో అయస్కాంతాలు 80 నుంచి 100 వరకు ఉన్నట్టు గుర్తించారు.
ఆయస్కాంతాలు అతడి పేగుల్లో, పెద్దపేగుల్లో చిక్కుకుపోయాయని, వాటి ఒత్తిడి కారణంగా ఆ ప్రాంతాలు దెబ్బతిన్నట్టు డాక్టర్లు తెలిపారు. అయస్కాంతాల అమ్మకంపై 2013 నుంచి నిషేధం ఉన్నా ఆన్లైన్ కంపెనీ టెము ద్వారా వాటిని విచ్చలవిడిగా అమ్ముతున్నారని, ఆ కంపెనీపై చర్య తీసుకోవాలని ఆ దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.