మాస్కో : జీవనోపాధి, మెరుగైన వేతనం కోసం రష్యా ఆర్మీలో చేరిన పలువురు యువకుల ఆచూకీ గల్లంతవుతున్నది. ఏజెంట్ల మాటలు నమ్మి రష్యా ఆర్మీలో చేరిన భారతీయుల్లో ఇటీవల 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. మరో నలుగురి ఆచూకీ కనిపించటం లేదు.
రష్యాలో రెండుసార్లు పర్యటించిన జగదీప్ సింగ్ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన కీలక పత్రాల్ని సేకరించారు. మృతదేహాల్ని స్వదేశానికి రప్పించాలంటూ భారత విదేశాంగ శాఖను, విదేశాంగమంత్రిని ఆయన కోరుతున్నారు. చనిపోయిన వాళ్లలో ముగ్గురు పంజాబ్, ఏడుగురు ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్లకు చెందినవారని తెలిసింది.