కందుకూరు, అక్టోబర్ 29: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని కోరుతూ.. లేమూరు, అన్నోజిగూడ, పులిమామిడి తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి చేతిలో ఓడిపోతామనే భయంలో బీజేపీ నాయకులు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయాగ్రామాల సర్పంచ్‌లు పరంజోతి, కాకి ఇందిరమ్మ, సీనియర్ నాయకులు కాకి దశరథ ముదిరాజ్, ఎలుక మేఘనాథ్‌రెడ్డి, చిర్ర సాయిలు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ కాకి రాములు, కిసాన్ సెల్ అధ్యక్షుడు సొలిపేట అమరేందర్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్‌రెడ్డి, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు న్యాయం
ఆర్కేపురం, అక్టోబర్ 29 : ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందని బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ, డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్, షాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెంటూరి రవీందర్‌రెడ్డి తెలిపారు. మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితాఇంద్రారెడ్డికి మద్దతుగా ఆదివారం ఆర్కేపురం డివిజన్ టెలిఫోన్ కాలనీలో గడప గడపకూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఆపదొస్తే ఆదుకునే సబితాఇంద్రారెడ్డిని గెలిపించుకుంటే ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని.. బీఆర్ఎస్ ప్రభుత్వానికే మళ్లీ పట్టం కట్టాలని కోరారు.
సరూర్‌నగర్ డివిజన్లో..
కారు గుర్తుకు ఓటేసి సబితాఇంద్రారెడ్డి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ సరూర్‌నగర్ డివిజన్ నాయకులు కోరారు. సబితాఇంద్రారెడ్డికి మద్దతుగా ఆదివారం సరూర్‌నగర్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీ, ఎస్బీఐ కాలనీలో గడపగడపకూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సబితాఇంద్రారెడ్డి చేసిన అభివృద్ధే కనిపిస్తోందని.. 50 ఏండ్ల కాలంలో కాంగ్రెస్, ఇతర పాలకులు చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లలో చేసిచూపించారన్నారు. మరోమారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే రూ.400లకే సిలిండర్, మహిళలకు బీమా, సన్నబియ్యం, పింఛన్ల పెంపు, రైతుబంధు పెంపు వంటి పథకాలను పొందవచ్చని చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చిన రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్‌రెడ్డి, పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి, బేర బాలకిషన్, లోకసాని కొండల్‌రెడ్డి, ఇంటూరి అంకిరెడ్డి తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
మహేశ్వరం, అక్టోబర్ 29: బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు దయాల శ్రీను తెలిపారు. ఆదివారం సిరిగిరిపురం గ్రామంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఎన్నికల ఇన్చార్జి ముత్యంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుందని ధీమా వ్యక్త పరిచారు. నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులే ఆమె గెలుపునకు బాటలు పడుతున్నాయని అన్నారు. వేలాది కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగంలో నిలుపుతున్న సబితా ఇంద్రారెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, బండ నర్సింహ, రాములు, వెంకటేశ్, సురేశ్ పాల్గొన్నారు.
మంత్రిని భారీ మెజారిటీతో గెలిపించాలి
మహేశ్వరం, అక్టోబర్ 29: మంత్రి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కో-ఆప్షన్ సభ్యుడు, ఎన్నికల ఇన్చార్జి సయ్యద్ ఆదిల్ అలీ తెలిపారు. నాగులదోని తండా, దయాలగుండు తండాల్లో జరిగిన బూత్ కమిటీ సమావేశంలో గ్రామ సర్పంచ్ మెగావత్ రాజునాయక్, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు గోపాల్‌నాయక్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని.. తండా ప్రజలకు స్వయం పాలనను అందిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాబోయె ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తండా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవినాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ కడమోని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.