వనస్థలిపురం, ఆగస్టు 13: ఫుడ్ డెలివరీ చేయడానికి మంగళవారం రాత్రి వెళ్తున్న ఓ జొమాటో డెలివరీ బాయ్ ఇన్నర్ రింగ్రోడ్లోని టీకేఆర్ కమాన్ సమీపంలో ఉన్న ఓపెన్ నాలాలో బైక్‌తో సహా పడిపోయాడు. నాలా నిండుగా ప్రవహిస్తుండడంతో రోడ్డుపైనే నీళ్లు నిలిచాయని భావించిన బాధితుడు.. అటు నుంచి వెళ్లి ఒక్కసారిగా అందులో పడిపోయాడు.
స్పందించిన స్థానికులు తాడు వెసి పైకి లాగారు. తర్వాత బైక్‌ను కూడా తాళ్లతో లాగారు. బాధితుడి సెల్ ఫోన్ కూడా నీళ్లలో కొట్టుకుపోయింది. జీహెచ్ఎంసీ, హైడ్రా నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా నాలా ఉన్నప్పటికీ కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు.