VIDEO | హైదరాబాద్ (Hyderabad) నగరంలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. రాత్రిపూట నడిరోడ్డుపై ప్రమాదకర స్టంట్స్ ప్రదర్శించారు. అతివేగంగా నడపడమే కాకుండా.. కదులుతున్న కారులో నుంచి రాకెట్ షాట్స్ టపాసులు పేల్చారు (Rocket Shots from a moving car). ఈ ఘటన పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే (PVNR Expressway)పై చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న వాహనదారులు ఆకతాయిలు చేసిన పనికి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ దృష్యాలు వైరల్గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కారులో నుండి రాకెట్ షాట్స్ టపాకాయలు పేల్చిన ఆకతాయిలు
హైదరాబాద్ – పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై కదులుతున్న కారులో నుండి రాకెట్ షాట్స్ పేల్చిన ఆకతాయిలు pic.twitter.com/sQvpCvgo72
— Telugu Scribe (@TeluguScribe) December 25, 2025
Also Read..
Accident | ఏపీలో మరో యాక్సిడెంట్.. సూర్యాపేటకు చెందిన ముగ్గురు మృతి
Devarakadra | వైన్స్లో వాటా ఇస్తావా..? దందా బంద్ చేయల్నా..?.. కాంగ్రెస్ నేతల దౌర్జన్యం