మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబర్ 24 : యువత క్రీడల్లో రాణించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ కుందన్పల్లి గ్రామంలో రాష్ట్ర సగర యువజన సంఘం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్ శనివారం ముగిసింది. మహబూబ్నగర్ – సంగారెడ్డి జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు విజయం సాధించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, సగర సంఘం నాయకులు మారుతి, ఉప్పరి శేఖర్, హరి కిషన్, సత్యం, భిక్షపతి, సతీశ్, సురేశ్, రాము, సాయి గణేశ్, నరేందర్, శేఖర్, ఆంజనేయులు, మహేశ్వరి, స్రవంతి, పల్లవి, తదితరులు పాల్గొన్నారు.