రోజ్‌గార్ మేళాతో యువతకు ఉపాధి
దేశాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని, ఎన్నో సంస్కరణలతోనే ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతుందని కేంద్ర మంత్రి మురుగన్ అన్నారు.
- కేంద్ర మంత్రి మురుగన్
జవహర్‌నగర్, ఫిబ్రవరి 12 : దేశాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని, ఎన్నో సంస్కరణలతోనే ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతుందని కేంద్ర మంత్రి మురుగన్ అన్నారు. హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీలో రోజ్‌గార్ మేళా-12 కేంద్ర సంస్థలకు చెందిన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, గిరిజన, రెవెన్యూ, హోంశాఖ, ఉన్నత విద్యా, అణు ఇంధన, రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు నియామకమైన 259 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మురుగన్ మాట్లాడుతూ రోజ్‌గార్ మేళాతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ హాయంలో 10లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రధాన మంత్రి మోదీ హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు 3లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా అనేక మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్ సునీల్ ఇమ్మానియేల్, డీఐజీ శ్రీనివాస్, అగ్నిమాపక శిక్షణ సంస్థ(ఎఫ్ఎస్ఐ) డీఐజీ, జేకే తివారి, అధికారులు, కొత్తగా నియామితులైన ఉద్యోగుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

