హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మరోసారి స్ట్రీట్ ఫైట్ కలకలం సృష్టించింది. మొఘల్‌పురాలో అంధేరిగల్లీలో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ ఘర్షణలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడిని నవాజ్ అహ్మద్ (15)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. యువకుని మరణానికి స్ట్రీట్ ఫైటే కారణంగా భావిస్తున్నారు.