హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ మహిళలను ఎత్తుకెళ్లడమో, హత్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అపహరణకు (Kidnap) గురైంది. ఘట్కేసర్ సమీపంలోని అంకుషాపూర్లో దుండగులు ఓ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకి తీసుకెళ్లారు.
డయల్ 100 ద్వారా బాధితురాలి తల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించిన అధికారులు యువతిని ఎత్తుకెళ్లిన కారు హైదరాబాద్-వరంగల్ హైవేపై భువనగిరి వైపు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బాధితురాలి బంధువే ఆమెను అపహరించినట్లు భావిస్తున్నారు.