హైదరాబాద్ : నగరంలోని అమీర్పేట మెట్రోస్టేషన్పై యువతి దూకి ఆత్మహత్యకు యత్నించింది. మెట్రో స్టేషన్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకడంతో యువతి టింబర్ డిపోలో పడిపోయింది. వెంటనే 108 వాహనంలో యువతిని మెట్రో సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే, యువతికి సంబంధించి వివరాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువతి వివరాలు ఆరా తీస్తున్నారు. కుటుంబ సమస్యలా? ఆర్థిక సమస్యలా? మరేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.