శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17: పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడు నివాసం ఉండే ఇంటిపై నుంచి దూకడంతో ప్రియురాలికి తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం… అసోం రాష్ట్రం, కోచర్ జిల్లా, బస్కంది గ్రామానికి చెందిన సుల్తానా బేగం(26) నగరానికి వలస వచ్చి సిద్ధిఖీనగర్‌లో నివాసం ఉంటుంది.
గచ్చిబౌలిలోని అంతేరా హో టల్లో వెయిటర్ గా పని చేస్తోంది. వెస్ట్ బెంగాల్ , నిదియా జిల్లా, ఉత్తర్బరా అం దులా గ్రామానికి చెందిన షైదులా షేక్ గచ్చిబౌలిలోని నావాబ్ హోటల్లో మేనేజర్ గా పని చేస్తున్నాడు. దీంతో పాటు పార్ట్ టైమ్ జాబ్ గా పెస్ట్ కంట్రోల్ పనులు చేస్తున్నాడు. సుల్తానా, షైదుల్లా షేక్‌ల లు మూడేళ్లు ప్రేమించుకుంటున్నారు.
సుల్తానా తల్లిదండ్రులు సుల్తానాకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. దీంతో సుల్తానా పెళ్లి చేసుకోవాలని షైదుల్లాపై ఒత్తిడి పెంచింది. బుధవారం సాయత్రం పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వివిధ రకాల కారణాలు చెప్పి పెళ్లికి నిరాకరించిన ప్రియుడు ఆమె ఫోన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాడు. దీంతో సుల్తానా మరో యువతికి ఫోన్ చేసి తన ప్రియుడు ఇంటికి వెళ్లి భవనం పై నుంచి దూకి చనిపోతానని చెప్పింది.
ఆ విషయాన్ని సదరు యువకుడికి చెప్పినా పెద్దగా పట్టించుకోలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియురాలు సుల్తానా గురువారం షైదుల్లా షేర్ నివాసం ఉండే భవనంపైకి ఎక్కి ఆరో అంతస్తు నుంచి దూకడంతో పార్క్ చేసి ఉన్న బ్రీజా కారుపై పడింది. కారు ధ్వంసం కావడంతో పాటు ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.