మైలార్‌దేవ్‌పల్లి, మే 7: షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఓ యువకుడు చనిపోయాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్‌కు చెందిన వికాస్(21) కాటేదాన్ పారిశ్రామికవాడలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. మనీష్సింగ్తో కలిసి లక్ష్మీగూడలోని బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
గురువారం ఉదయం మనీష్‌సింగ్ వాకింగ్ కోసం బయటకు వెళ్లా డు. వికాస్ బెడ్రూంలో నిద్రపోతున్నాడు. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటి లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుపోయిన వికాస్ చనిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు వికాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.