ప్రాణం తీసిన ఆన్లైన్ గేమింగ్
ఆన్లైన్ గేమ్‌లకు బానిసలై విలువైన ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు మరొకటి వెలుగుచూసింది. ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు పొగొట్టుకున్నాననే మనస్తాపంతో భార్య తిడుతుందనే భయంతో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది.
- దుండిగల్ తండాలో మధ్యప్రదేశ్ యువకుడు ఆత్మహత్య
దుండిగల్, ఏప్రిల్ 18: ఆన్లైన్ గేమ్‌లకు బానిసలై విలువైన ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు మరొకటి వెలుగుచూసింది. ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు పొగొట్టుకున్నాననే మనస్తాపంతో భార్య తిడుతుందనే భయంతో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన సోంపాల్ (32) ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చి దుండిగల్ తండా-2లో నివాసం ఉంటున్నాడు.
వృత్తిరీత్యా డ్రైవర్ అయిన సోంపాల్కు ఆన్లైన్ గేమ్‌లు ఆడే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఆన్లైన్ గేమ్‌లో సుమారు రూ.30 వేలు పొగొట్టుకున్నాడు. దీంతో ఈ విషయం తన భార్యకు తెలిస్తే తిడుతుందనే ఆందోళనకు లోనయ్యాడు. భయం, మనస్తాపం తోడు కాడంతో ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

