UPI | సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించి.. తప్పు డు పేమెంట్ జరిగిందంటూ.. బ్యాంకులకు ఫిర్యాదు చేసి..డబ్బులను తిరిగి తమ ఖాతాల్లోకి రప్పించుకుంటూ…మోసం చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన 13 సభ్యులు గల ముఠాను సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశా రు. నిందితుల నుంచి రూ.1.72 లక్షల నగ దు, రూ.50 లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో క్రైమ్ డీసీపీ నర్సింహ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన సోమ్రాజ్, సునీ ల్, లక్రామ్, శర్వాన్, సోమ్రాజ్, శివ్లాల్, రమేశ్, శ్రావణ్, రాకేశ్, రమేశ్, అశోక్ కుమార్ యూపీఐ చెల్లింపులతో ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసి, తరువాత తప్పు డు చెల్లింపులు జరిగినట్లు బ్యాంకులకు ఫిర్యా దు చేసి.. యూపీఐ ద్వారా చెల్లించిన డబ్బుల ను తిరిగి తమ ఖాతాల్లోకి వెనక్కి రప్పించుకుంటున్నారు.
ఈ విధంగా నగరంలోని ట్రై కమిషనరేట్ల పరిధిలోనే సుమారు రూ.4కోట్ల మోసాలకు పాల్పడ్డారు. రాజస్థాన్‌కు చెందిన ఈ ముఠా సభ్యుల్లో కొంతమంది హైదరాబాద్‌లో తిష్ట వేయగా, మరికొందరు రాజస్థాన్ నుంచి చక్రం తిప్పుతారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉన్న ముఠా సభ్యులు నగరంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షో రూమ్‌లను సందర్శిం చి, అక్కడ ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేస్తారు.
ఇందులో భాగంగా షో రూంలో చెల్లింపులకు సంబంధించి స్కానర్ ను ఫొటో తీసి రాజస్థాన్‌లో ఉన్న తమ ముఠా సభ్యులకు పంపుతారు. దీంతో రాజస్థాన్‌లో ఉన్న మిగిలిన ముఠా సభ్యులు తమ సహచరులు పంపిన బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్కానర్‌కు యూపీఐ ద్వారా డబ్బులు చెల్లిస్తారు. అనంతరం ఎలక్ట్రానిక్ పరికరాలు డెలివరీ అయిన వెంటనే ముఠా సభ్యులు వాటిని ఇతరులకు విక్రయిస్తారు.
అదే సమయంలో రాజస్థాన్‌లో ఉన్న గ్యాంగ్ తమ ఖాతా నుంచి తప్పుడు చెల్లింపులు జరిగినట్లు సంబంధిత బ్యాంకుల కు ఫిర్యాదు చేసి.. తమ డబ్బును వెనక్కి పం పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. రాజస్థాన్ నుంచి యూపీఐ ద్వారా హైదరాబాద్‌లోని షోరూంలకు చెల్లింపులు జరగడంతో పొరపాటు జరిగి ఉండవచ్చని సదరు బ్యాంక్‌లు యూపీఐ ద్వారా జరిగిన చెల్లింపులను వెనక్కి రప్పిస్తాయి.
ఈ విధంగా రాజస్థాన్ ముఠా సభ్యులు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు తరచూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని పలు ఠాణాల్లో కేసులు నమోదవుతున్నాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్ సీసీఎస్ పోలీసులు, కేపీహెచ్‌బీ, మాదాపూర్, నార్సిం గి పోలీసులు కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి.. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.