మన్సూరాబాద్, అక్టోబర్ 28: మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మంది ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ ఎన్నో ఉన్నత పదవులు కట్టబెట్టి తగిన గౌరవం కల్పించారని ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మన్సూరాబాద్‌లోని ఎస్కేగార్డెన్లో శనివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారుల సమస్యలను ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మొదటి విడతలో 100 మందికి దళితబంధు కింద రూ.10 లక్షలు మంజూరు కాగా అందులో 16 మంది ఉద్యమకారులకు దళితబంధును ఇవ్వడం జరిగిందని తెలిపారు.
రెండో విడతలో వెయ్యిమందికి మంజూరు కాగా 120 మంది ఉద్యమకారులకు రైతుబంధు మంజూరు చేయించామని.. ఎన్నికల నోటిఫికేషన్ రావడం వలన అర్ధాంతరంగా రెండో విడత దళితబంధు నిలిచిపోయిందని తెలిపారు. ఉద్యమకారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని జీహెచ్ఎంసీ పరిధికి చెందిన ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను కోరడం జరిగిందని తెలిపారు. ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం వలన ముందడుగు వేయలేక పోయామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమకారుల పాత్ర ఎంతో కీలకమైందని తెలిపారు.
రాష్ర్టాభివృద్ధిలోను ఉద్యమకారులను తమ వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఉద్యమకారుల సహకారం వలనే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు సక్రమంగా చేరగలుగుతున్నాయని తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఉద్యమనేత కాచం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రూబీ స్టీవెన్సన్, ప్రధానకార్యదర్శి పిండిగ వెంకన్న, నాయకులు కుంట్లూరు వెంకటేశ్‌గౌడ్, వీరమల్ల రాంనర్సింహ గౌడ్, ఎర్రోజు శ్రీనివాస్, విజయానంద్, మహేందర్, మియాపురం రమేశ్, సుర్వి రాజుగౌడ్, సతీశ్‌యాదవ్, బీరెల్లి వెంకట్‌రెడ్డి, యుగంధర్‌శర్మ, రుద్రాల స్వామి, డబ్బికార్ మధు, ఆడాల యాదయ్య, మల్లెపాక యాదగిరి, శ్యామ్యాదవ్, నీళ్ల నర్సింగ్‌గౌడ్, నీళ్ల లింగస్వామి గౌడ్, సల్వాచారి తదితరులు పాల్గొన్నారు.