మల్లాపూర్, మార్చి 24: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన వేడుకల్లో ఆయన కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మహిళలు సమాజానికి మూలస్తంభాలు అని అన్నారు. మహిళలు కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని ముందుకు నడిపించే శక్తివంతమైన వ్యక్తులని పేర్కొన్నారు. వారి కృషి, త్యాగం, అభిప్రాయ స్వాతంత్ర్యం మన అందరికీ ప్రేరణ అని అన్నారు. ప్రతి మహిళకు గౌరవం, సమానత్వం, ప్రోత్సాహం అందించేందుకు మనమందరం కృషి చేయాలని సూచించారు.