Woman Missing | శంషాబాద్ రూరల్, మే 27 : యువతి అదృశ్యమైన ఘటన మంగళవారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చదర్గూడ గ్రామానికి చెందిన బక్క రజిని(26)ఇంటి వద్దనే ఉంటు జీవనం సాగిస్తుంది. ఈ నెల 25 తేదీన ఉదయం 8 గంటల సమయంలో యువతి తండ్రి శంకరయ్య పని నిమిత్తం బయటికి వెళ్లి తిరిగి అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా కూతురు కనిపించలేదు. దీంతో ఆయన గ్రామంలో ఎక్కడ చూసిన ఆమె జాడ కనిపించలేదు. యువతికి నరాల బలహీనత ఉందని వివరించారు. దీంతో ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదని ఆమె ఆచూకీ కోసం శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.