Woman Missing | ఉస్మానియా యూనివర్సిటీ : ఇంట్లో చోటు చేసుకున్న చిన్న గొడవ కారణంగా ఒక యువతి ఇల్లు విడిచి వెళ్లిన ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగరాణి తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ సంజన (19) కుటుంబంతో సహా తార్నాక డివిజన్ ఇందిరానగర్లో ఉంటూ, డిగ్రీ చదువుకుంటోంది. ఈ నెల 14న కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప గొడవ చోటుచేసుకుంది. దీంతో ఈ నెల 18న ఉదయం 11 గంటలకు సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా సంజన వెళ్లిపోయింది. దాంతో సంజన గురించి బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. గతంలో ఒక నెల క్రితం ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకసారి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంజన కొన్ని రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. ఈసారి మాత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో సంజన అన్న సోమేశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.