KPHB | కేపీహెచ్బీ కాలనీ, జూలై 13 : భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న ఓ యువతి అదృశ్యమైన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారంలో నివాసం ఉండే కేసు రత్నం కూతురు ఎం.సునీత (21) భర్తతో విడిపోయి తల్లిదండ్రులతో నివసిస్తుంది. జూన్ 6న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లిన యువతి మరునాడు ఇంటికి వచ్చి… తాను కేపీహెచ్బీ కాలనీ మొదటి రోడ్లోని హాస్టల్లో ఉంటున్నట్టు చెప్పింది. కూతురుతో కలిసి హాస్టల్ చూడడానికి వచ్చిన తండ్రిని సర్వీస్ రోడ్డులో వదిలేసి ఆ యువతి వెళ్లిపోయింది. బంధుమిత్రులను విచారించిన ఫలితం లేకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.