మన్సూరాబాద్, ఎల్బీనగర్, మే 23 : హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూరు, న్యూ జీవీఆర్ కాలనీకి చెందిన నిహారిక ప్రైవేటు ఉద్యోగి. నిహారిక పిల్లలు ఇద్దరు నాగోల్, బండ్లగూడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. ప్రతి రోజు ఆమె తన స్కూటీపై పిల్లలను పాఠశాలకు తీసుకుపోతుంది. ఈ క్రమంలో ఆనంద్‌నగర్ చౌరస్తా పరిసరాలతో పాటు బండ్లగూడ సర్కిల్లో రోడ్లు గుంతలమయంగా మారడంతో వాహనదారులు నిత్యం ప్రమాదాల బారినపడుతున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాజీవ్ స్వగృహ సముదాయాల నుంచి ఆనంద్‌నగర్ చౌరస్తా మీదుగా బండ్లగూడ చౌరస్తా వరకు రోడ్డు అధ్వానంగా తయారైంది.
ఒకవైపు గుంతలు.. మరోవైపు గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఆ మార్గంలో ప్రయాణించాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో గురువారం ఉదయం నిహారిక తన పిల్లలతో కలిసి స్కూటీపై నాగోల్ వైపునకు వెళ్తుండగా ఆనంద్‌నగర్ చౌరస్తా వద్ద గుంతలమయంగా మారిన రోడ్డులో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పిల్లలతో సహా కింద పడ్డారు. స్వల్ప గాయాలు కావడంతో పిల్లలను ఇంటిలో వదిలి పెట్టి, తిరిగి తన ఆవేదనను వ్యక్తం చేసేందుకు అక్కడకు వచ్చింది. గుంతలమయంగా మారిన రోడ్లలో పేరుకుపోయిన బురదనీటిలో కూర్చుని ‘రోడ్లు బాగు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి’ అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు.
అర గంట పాటు ఆమె బురదలో కూర్చుని ఆందోళన చేపట్టారు. జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి స్పష్టమైన హామీనివ్వాలని అప్పటి వరకు నిరసనను విరమించేది లేదంటూ ఆమె భీష్మించుకు కూర్చున్నారు. ట్రాఫిక్ పోలీసులు వచ్చి నచ్చ చెప్పినా ఆమె ససేమిరా అన్నారు. విషయాన్ని తెలుసుకుని నాగోల్ కార్పొరేటర్ భర్త చింతల సురేందర్‌యాదవ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్ల మరమ్మతుల కోసం నిధులు మంజూరయ్యాయని ఎన్నికల కోడ్ ఉన్నందునే పనులు చేపట్టలేదని తెలిపారు. కోడ్ ఎత్తివేయగానే రోడ్లను బాగు చేస్తామని ఆమెకు హామీనిచ్చారు. ముందస్తుగా యుద్ధప్రాతిపదికన గుంతలను మట్టితో పూడ్చి, ప్రమాదాలు జరుగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో నిహారిక తన నిరసన విరమించారు. గురువారం సాయంత్రం ఆగమేఘాలపై జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి మట్టితో రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు.
ఈ సంఘటన తర్వాత హయత్‌నగర్ సర్కిల్ ఈఈ రమేశ్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. తమ పరిధిలోని రోడ్లపై గుంతలను ఎప్పటికప్పుడు పూడుస్తున్నట్లు చెప్పడం గమనార్హం. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశానుసారం ఐఆర్టీ బృందంతో గుంతలను పూడుస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి నాగోల్ ఎక్స్ రోడ్డు నుంచి బండ్లగూడ తాజా టిఫిన్స్ వరకు ఉన్న రోడ్డు ఆర్అండ్బీ పరిధిలోకి వస్తుందన్నారు.
ఎనిమిదేండ్ల కిందట హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ వారు ఈ రోడ్డును అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కొంతకాలం కిందట రోడ్డు అక్కడక్కడ బాగా దెబ్బతినడంతో తిరిగి జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు రోడ్డు పునరుద్ధరణ, మరమ్మతులకు వేర్వేరుగా రూ.1.99 కోట్ల చొప్పున రెండు ప్రతిపాదనలు కూడా పంపామన్నారు. అయితే ఇటీవలనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా ఎస్ఐజీ కింద చేపట్టిన 756 పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ రద్దు చేయడం తెలిసిందే.
నాగోల్ చౌరస్తా నుంచి ఆనంద్‌నగర్ చౌరస్తా మీదుగా హిందూ అరణ్యకు వెళ్లే మార్గంలో సుమారు 30 ప్రదేశాల్లో రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. గుంతలమయంగా మారిన రోడ్లతో చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయాన్ని గతంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఎక్స్‌లో ట్వీట్ చేసి తెలియజేసినా స్పందించ లేదు. రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. ఇప్పుడు వర్షాలు పడుతుండటంతో గుంతల్లో నీరు చేరి ప్రమాదకరంగా తయారయ్యాయి. ప్రమాదకరంగా ఉన్న గుంతలో నాతో పాటు అనేక మంది వాహనదారులు కింద పడి గాయాలయ్యాయి. ఇంకెన్నాళ్లు భరించాలి?
– ఎయిమ్స్ పూర్వ విద్యార్థి డాక్టర్ ప్రసాద్ గురు హైదరాబాద్ ఫొటోలను జోడిస్తూ గతంలో ట్వీట్ చేశారు.
– తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రశంస
– సినీ నటి లయ అమెరికా నుంచి హైదరాబాద్కువచ్చిన తర్వాత వ్యక్తం చేసిన అభిప్రాయం.
– బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్‌షా స్పష్టీకరణ
– ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీడియోల్ మనోగతం
– బీజేపీ ఎంపీ సన్నీడియోల్