Woman | చార్మినార్, మార్చి 12 : మహిళలు ఆరోగ్యాంగా వున్నపుడే కుటుంబం సంతోషంగా ఉంటుందని అక్షిత ఫౌండషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సన్నీ రాపాక తెలిపారు. బుధవారం అక్షిత ఫౌండషన్ ఆధ్వర్యంలో పేట్లబుర్జు ఆధునిక ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో 100 మంది బాలింతలకు సన్నీ రాపాక మిల్క్ బ్రెడ్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి మహిళానే ఆధారం. కుటుంబాలో ఎన్నో పాత్రలను పోషించే అమ్మ తను ఆరోగ్యాంగా వున్నప్పుడే అన్ని సవ్యంగా కొనసాగుతుంటాయి. మహిళల ముఖ్య పాత్రను గుర్తిస్తూ ఈ రోజు వారి క్షేమం కోరూతూ ఆరోగ్య సంరక్షణ కోసం బ్రెడ్ అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ఆసుపత్రి హెల్త్ సూపర్వైజర్ డి. వినోదా భాయ్, సునీల్ కుమార్, రాజేష్, తానజీ వాసవి లత, అనుషా తదితరులు పాల్గొన్నారు.