కవాడిగూడ, ఏప్రిల్ 28: డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా వాహనాన్ని నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ట్యాంక్‌బండ్‌పై ఈ సంఘటన చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాలు.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల్ గ్రామానికి చెందిన అంబీర్ మధుసూదన్‌రావు ఆయన భార్య అంబీర్ శారద(50) ద్విచక్రవాహనంపై జేబీఎస్ నుంచి మెహదీపట్నంలోని తమ కుమారుడి ఇంటికి ఆదివారం రాత్రి పదిన్నరకు వెళ్తున్నారు.
అదే సమయంలో ట్యాంక్‌బండ్ పై నున్న తిక్కన సోమయాజులు విగ్రహం సమీపంలోకి రాగానే వెనుకనుంచి అతి వేగంగా వచ్చిన అశోక్‌లేల్యాండ్ వాహనం మధుసూదనరావు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా.. వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భార్య శారద గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు దర్యాప్తులో ఉన్నది.