రంగారెడ్డి : మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మనీషా (28) ఆత్మహత్య చేసుకుంది. 2020 బ్యాచ్‌కి చెందిన మనీషా గత 5 సంవత్సరాలుగా మీర్పేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నది. కుటుంబ కలహాల నేపథ్యంలో వారం రోజుల క్రితం ప్రశాంతి హిల్స్ లోని తన ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న మనీషాను దవాఖానలో చేర్పించారు.
చికిత్స పొందుతూ నాంపల్లి కేర్ హాస్పిటల్లో శనివారం మరణించింది. కాగా, తన భర్త వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ మనీషా కుటుంబ సభ్యులు కేర్ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.