జీహెచ్ఎంసీ పరిధిలో టెండర్ల ప్రక్రియ కాస్తా ‘పర్సంటెజీల’ పర్వంగా మారిపోయింది. ‘అడిగినంత ఇచ్చుకో.. టెండర్ పట్టుకో’ అనే చందంగా సాగుతున్నది. నిన్నటి వరకు కొందరు ఇంజినీర్ల వరకే పరిమితమైన ఈ తరహా వ్యవహారం ..తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యేల వరకు చేరింది. జీహెచ్ఎంసీ నిబంధనలను తుంగలో తొక్కి.. స్థానిక కాంట్రాక్టర్ల పొట్టగొట్టి, బడా ఏజెన్సీలకు దోచిపెట్టేందుకు తెర వెనుక పెద్ద సెచ్చే నడిపారు. అధికార పార్టీకి చెందిన శివారు ప్రాంత బలమైన సామాజిక వర్గ ఎమ్మెల్యే ఆశీస్సులతో బల్దియా ఉన్నతాధికారులు కొందరు చేతులు కలిపి ఈ నయా దందాకు తెరలేపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. -సిటీబ్యూరో
బడా కంపెనీలకే లాభం
ఆదిబట్ల సర్కిల్లోని పలు ప్రాంతాల్లో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, యూజీడీ ఈ పనులన్నింటినీ కలిపి భారీ మొత్తంలో ‘మ్యాసివ్ ప్యాకేజీలు’గా మార్చి టెండర్లు పిలవాలని అధికారులు భావించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై కాంట్రాక్టర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఆదిబట్ల సర్కిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్, శంషాబాద్ జోన్ కాంట్రాక్టర్ అసోసియేషన్ నేతలు సుంకరి సత్తయ్య, విష్ణువర్థన్ రెడ్డి, టి. భాస్కర్ రెడ్డి, అంబాదాస్, శంకర్రావు, గుంటి సాయికిరణ్‌లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఛాంబర్లో ఫిర్యాదు లేఖను సమర్పించారు.
అధికారుల తాజా ప్రతిపాదనల ప్రకారం టెండర్లు కేవలం కార్పొరేట్ లేదా బడా కాంట్రాక్టర్లకు మాత్రమే దకుతాయని, దీనివల్ల స్థానికంగా ఉండే చిన్న తరహా కాంట్రాక్టర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని లేఖలో వివరించారు. అదిబట్ల సరిల్ పరిధిలో దాదాపు 350 నుంచి 400 మంది స్థానిక చిన్న కాంట్రాక్టర్లు ఈ పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. పెద్ద ప్యాకేజీల విధానం వల్ల వందలాది స్థానిక కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఈ వృత్తి తప్ప మరో జీవనోపాధి తెలియదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కాంట్రాక్టర్లమే కావడం వల్ల తాము నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, పనులను అత్యంత నాణ్యతతో పూర్తి చేస్తామన్నారు.

సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆయా సరిళ్లలో చిన్న, చిన్న సివిల్ పనులు, అంతర్గత రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ పనుల విలువ కొన్ని లక్షల్లోనే ఉంటుంది. స్థానిక కాంట్రాక్టర్లు ఈ టెండర్లలో పాల్గొని పనులు దకించుకుంటారు. అయితే, ఇకడే అధికార పార్టీ ఎమ్మెల్యే తన మారు ‘తెలివితేటలు’ ఉపయోగించారు. లక్షల్లో విడివిడిగా జరగాల్సిన సివిల్ పనులన్నింటినీ కలిపేసి, ఏకంగా సర్కిల్ పరిధిని దాటించి చీఫ్ ఇంజినీర్ పరిధిలోకి వచ్చేలా రూ.10 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు బల్ మొత్తంతో ఒకే టెండర్‌గా ఉండేలా రూపకల్పన చేశారు. ప్రయోగాత్మకంగా తొలుత అధికారులు ఆదిబట్ల సర్కిల్లోని వార్డు నం. 53లో యూజీడీ, సీసీ రోడ్లు, వార్డు నంబర్ 56లో సీసీ రోడ్లు, యూజీడీ పనులకు సంబంధించి 20 ప్రాంతాల్లో పనులను రూ. 20కోట్లుగా ఒకే టెండర్ చేసి ప్రధాన కార్యాలయ సీఈ పరిధిలోకి వెళ్లేలా సర్కిల్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నేడో, రేపో సీఈ పరిధిలోకి తీసుకొచ్చి అధికారం అండతో కాకులను కొట్టి -గద్దలకు పంచిపెట్టినట్టుగా ఒక్క బడా ఏజెన్సీకే సర్కిల్ పనులు అప్పగించేందుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం.
నిబంధనలు బలి.. సరిల్ దాటించి సీఈ పరిధిలోకి..!
జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం సర్కిల్ పరిధిలోని ఏఈ పరిధిలో రూ. 50 లక్షల లోపు, ఎస్ఈ పరిధిలో రూ. 3 కోట్ల వరకు పనులకు టెండర్లను పిలిచే అర్హత ఉంటుంది. రూ.3 కోట్లు దాటిన ఏ పని ఐనా చీఫ్ ఇంజినీర్ (సీఈ) స్థాయిలో ఉంటుంది. అయితే ఏఈ పరిధిలో ఉండాల్సిన సర్కిల్ నిర్వహణ పనులను సైతం ప్రధాన కార్యాలయానికి మార్చేశారు. స్థానిక సరిల్ కార్యాలయాల పరిధిలోనే జరగాల్సిన పనులకు సంబంధించి స్థానిక కాంట్రాక్టర్లు పోటీ పడతారని, తమకు అనుకూలమైన పెద్ద ఏజెన్సీలకు కట్టబెట్టడం కుదరదని భావించిన సదరు ఎమ్మెల్యే వింత పోకడకు శ్రీకారం చుట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ పనుల విలువను బల్క్ ప్యాకేజీగా మలిచి టెండర్ల ప్రతిపాదనలను సరిల్ కార్యాలయం నుంచి ఏకంగా చీఫ్ ఇంజినీర్ (సీఈ) పరిధిలోకి బదిలీ చేయించేశారు. పెద్ద మొత్తంలో టెండర్లు ఉంటేనే పెద్ద ఏజెన్సీలు రంగంలోకి దిగుతాయనే పకా ప్లాన్‌తోనే ఈ పని చేసినట్లు స్పష్టమవుతున్నది.
8 శాతం ‘కమీషన్’.. బడా బాబులకే ఎమ్మెల్యే ఆఫర్!
ఈ వ్యవహారమంతా కేవలం పనుల నాణ్యత కోసమో, త్వరితగతిన పూర్తి చేయడం కోసమో అనుకుంటే పొరపాటే. దీని వెనుక దాగున్న అసలు సూత్రం.8 శాతం పర్సంటెజీ..!! టెండర్ దకించుకోవాలంటే ముందస్తుగానే 8 శాతం కమీషన్ ఇచ్చుకోవాలనే నిబంధనను ఎమ్మెల్యే తెరపైకి తెచ్చినట్లు సర్కిల్ కార్యాలయంలో విస్తృత చర్చ జరుగుతున్నది.. ఇంత పెద్ద మొత్తంలో కమిషన్లు ఇచ్చుకోవడం చిన్న కాంట్రాక్టర్ల వల్ల కాదని తెలిసి.. ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పెద్ద ఏజెన్సీలకు ఈ టెండర్లను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.