Wine Shops | హైదరాబాద్ : గణేశ్ నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉండనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాచకొండ పరిధిలోని భువనగిరి జోన్లో మాత్రం మద్యం దుకాణాలకు ఈ నిబంధన వర్తించదు అని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. మిగతా జోన్లలో నిబంధనలు అతిక్రమించి మద్యం దుకాణాలను తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.