Wine Shops | హైదరాబాద్ : హోలీ పండుగ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం, కల్లు దుకాణాలతో పాటు బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ధిక్కరించి ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.