Mla Gopinath | భారీ మెజార్టీతో మరోసారి విజయం సాధిస్తా : ఎమ్మెల్యే గోపీనాథ్ ధీమా
Mla Gopinath | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తాను భారీమెజార్టీతో మూడోసారి విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ (MLA Gopinath) ధీమా వ్యక్తం చేశారు.
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తాను భారీ మెజార్టీతో మూడోసారి విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ (MLA Gopinath) ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్(Jubilee Hills) లోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో 45.20 శాతం మాత్రమే పోలింగ్ నమోదైన విషయంపై ఆరా తీశారు.
బోరబండ డివిజన్, షేక్‌పేట డివిజన్, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్ డివిజన్ల పరిధిలో ఓటింగ్ నమోదుపై చర్చించారు. పోలింగ్ సరళిని బట్టి తాను గతంలో కన్నా మంచి మెజారిటీతో గెలువనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. డిసెంబర్ 3న కౌంటింగ్ రోజున పాటించాల్సిన జాగ్రత్తలను బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు అప్రమ్తత్తంగా ఉండాలని, నిర్దేశిత సమయంలోపునే కౌంటింగ్ కేంద్రంలోకి చేరుకోవాలని వారికి సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

