రామంతాపూర్, ఏప్రిల్ 7 : రామంతాపూర్ రజకుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణితో కలిసి ఆయన రజక సంఘ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రజక సంఘం నేతలు.. బట్టలు ఉతికే హౌజ్ వెనుకాల ఓపెన్‌గా ఉండటం వల్ల మందుబాబులకు అడ్డాగా మారిందని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
అదే విధంగా ప్రహరీచుట్టూ ఫెన్సింగ్ వేయించాలని, కమ్యూనిటీ హాల్పైన మరో అంతస్థుకు నిధులు మంజూరు చేయించాలని, కమ్యూనిటీహాల్ లోపల పవర్ బోర్ పనిచేయడం లేదని, కమ్యూనిటీహాల్ మధ్యలో నుంచి వెళ్తున్న నాలాకప్పు సరిగ్గా లేకపోవడంతో అది ప్రమాదకరంగా మారిం దన్నారు. శాశ్వతంగా ఉండే విధంగా స్లాబ్ వేయాలన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ రవి, సంఘం అధ్యక్షు డు లింగమయ్య, ప్రధాన కార్యదర్శి దానయ్య ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే… సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. రజకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కృష్ణ, శ్రీనివాస్, లింగం, భీమేశ్, రాజేంద్రప్రసాద్, చిన్న శ్రీనివాస్ , ముత్యం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.