హైదరాబాద్ : మియాపూర్లో దారుణం వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపి పూడ్చిపెట్టి భర్త కనిపించడం లేదని గతేడాది నవంబర్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగు చూశాయి.
భార్యే తన భర్తను ప్రియుడితో కలిసి చంపి ఆ మృతదేహాన్ని పోలీసులు పూడ్చినట్లు గుర్తించారు. భార్య కాల్ రికార్డులు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.