మియాపూర్ , ఆగస్టు 21 : మియాపూర్(Miyapur) పోలీస్ స్టేషన్లో పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య హత్య చేసిన(Wife killed husband) సంఘటన స్థానికంగా కలకలం రేపింది. భర్త మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో భార్య తాళలేక భర్తను భార్య హతమార్చిన సంఘటన మియాపూర్ ఠాణా పరిధిలో చోటు చేసుకున్నది. మియాపూర్ సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ బుధవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అస్సాం రాష్ర్టానికి చెందిన అలీ హుస్సేన్ లష్కర్(35) భార్య రుస్తానా బేగం ముగ్గురు పిల్లలతో కలిసి హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్ బీ బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. ఇంటి నిర్మాణ పనులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, మద్యానికి బానిసైన అలీ హుస్సేన్ నిత్యం భార్యను వేధిస్తుండటంతో భరించలేని భార్య రుస్తానా బేగం తన చున్నీతో భర్త మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.