బోడుప్పల్, అక్టోబర్31: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరందుకుంది.మేయర్ బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి,28డివిజన్లలో స్థానిక నాయకులు, కార్పొరేటర్లు ప్రభుత్వ పథకాలను, చేసిన అభివృద్ధిని వివరిస్తూ చామకూర మల్లారెడ్డికి మరోమారు పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మాటలు చెప్పే కాంగ్రెస్ కావాలా…? చేతలు చేసే బీఆర్ఎస్ కావాలా…? అంటూ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ప్రజలను జాగృతం చేస్తున్నారు. డివిజన్ల వారీగా ఆత్మీయ సమ్మేళనాలతో ఏర్పాటు చేసుకుని ప్రజలకు చేరువయ్యేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
మేడ్చ ల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిచామకూర మల్లారెడ్డిని మరోమారు భారీ మెజార్టీతో గెలిపించి, బోడుప్పల్ అభివృద్ధికి అండగా నిలువాలని కోరారు. మంగళవారం 1వ డివిజన్, 3వ డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.అదేవిధంగా ఎస్బీఆర్ కాలనీ, టెలిఫోన్ కాలనీలో మేయర్ బుచ్చిరెడ్డి, ఎన్ఐఎన్ కాలనీలో 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి, 10వ డివిజన్లో బొమ్మ క్ సుగుణబాలయ్య, ఈస్ట్ బాలాజీహిల్స్కాలనీలో సుమన్‌నాయక్, 11వ డివిజన్లో కొత్త శ్రీవిద్యచక్రపాణిగౌడ్ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జంగయ్యయాదవ్, చందర్‌గౌడ్, చీరాలనర్సింహ,పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాలకృష్ణ, నాయకులు ప్రతాప్‌రెడ్డి, జడిగరమేశ్, తాల్కశత్రజ్ఞ, వెంకటేశ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
లక్ష్మాపూర్ గ్రామంలో..
శామీర్‌పేట: ఎన్నికల ప్రచారంలో భాగం గా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం ప్రారంభించారు. సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో కళాకారుల బృందంతో ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి నేతృత్వంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గడప గడప తీసుకెళ్లడమే లక్ష్యంగా కళాకారుల బృందంలో ఎన్నికల ప్రచారం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అభివృద్ధికి కేరాఫ్ బీఆర్ఎస్
పీర్జాదిగూడ: అభివృద్ధికి కేరాఫ్ బీఆర్ఎస్ అని పీర్జాదిగూడ కార్పొరేషన్ 15వ డివిజన్ కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ అన్నారు. మంగళవారం డివిజన్ పరిధి పలు కాలనీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లారెడ్డి మద్దతుగా నాయకులు, వార్డు కమిటీ సభ్యులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు యాదగిరి, రమణారెడ్డి, సుధాకర్, వెంకటేశ్‌గౌడ్, సత్యంచారి,సుమిత్, సంతోష్, సంపత్, కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాలు కల్పించిన బీఆర్ఎస్ను గెలిపించాలి
ఘట్కేసర్ రూరల్: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలని మండల బీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్, కొండల్ రెడ్డి కోరారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ఎదులాబాద్‌లో మంగళవారం ఇంటింటికీ వారు ప్రచా రం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీ కంపెనీలకు ఆహ్వనం పలికి లక్షలాది యువతకు ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ప్రభుత్వంలోని ఉద్యోగా లను యువతన ఘనత బీఆర్ఎస్దేనన్నారు.కార్యక్రమంలో ఎదులాబాద్ వార్డుసభ్యులు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధే మంత్రి గెలుపునకు నాంది
కీసర: నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి చేసిన అభివృద్ధే ఆయన గెలుపునకు విజయసోపనాలు అవుతాయని బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ చామకూర భద్రారెడ్డి అన్నారు. కీసర మండలం రాంపల్లిదాయర, గోధుమకుంట గ్రామాల్లో మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయాలను డాక్టర్ భద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు అర్హులైన వారికి చేరడంతో వారంతా బీఆర్ఎస్ వెంటే ఉంటామని అంటున్నారని అన్నారు.స్వచ్ఛందంగా మంత్రి మల్లారెడ్డి కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేశారని అన్నారు.కార్యక్రమంలో గోధుమకుంట సర్పంచ్ మహేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ ఆంజనేయులు, బీఆర్ఎస్ నేతలు పెంటయ్య, కృష్ణ పాల్గొన్నారు.