RS Praveenmkumar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ప్రస్తావించిన సంధ్యారావు బీఆర్ఎస్ అనే ఫేక్ అకౌంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో సంధ్యారావు బీఆర్ఎస్ అనే సోషల్ మీడియా అకౌంట్ గురించి మాట్లాడారు. ఆ అకౌంట్ ఓనర్ ఎవరు..? ఆ అకౌంట్ ఎందుకు ఈ పోస్ట్ ఎక్స్‌లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి మాట్లాడిన ఒక గంటకే మీడియా మిత్రులంతా, సోషల్ మీడియా అంతా కూడా ముఖ్యమంత్రి అకౌంట్ ఫేక్ అకౌంట్ అని గుర్తించారో.. ఆ అకౌంట్ ముఖ్యమంత్రి మాట్లాడిన వెంటనే డిలీట్ అయిపోయిందన్నారు.
తెలంగాణలో గత 30 నెలలుగా ఫేక్ న్యూస్ ప్రభుత్వం నడుస్తుందని నిన్న మరోసారి అసెంబ్లీ వేదికగా నిర్దారణ అయిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. . తెలంగాణలో ఫేక్ ముఖ్యమంత్రి రాజ్యమేలుతున్నడు.. ఓ ముఖ్యమంత్రి అంటే ఏ మీడియాలో ఏం వస్తున్నది.. ఏ సోషల్ మీడియాలో ఏం వస్తున్నది.. వాళ్ల కిందుండే అధికారులతోనో.. లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉండే మంత్రులతోనో వెరిఫై చేసుకుని వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి.
ఏమీ వెరిఫికేషన్ లేకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రే సంధ్యారావు బీఆర్ఎస్ అనే ఖాతాను రెఫరెన్స్‌గా తీసుకొని ముఖ్యమంత్రి మాట్లాడారు. మరి మాట్లాడిన వెంటనే ఆ అకౌంట్‌ను అట్లానే పెట్టాలి కదా అని అడిగారు. దాన్ని వెంటనే ఎందుకు డిలీట్ చేసినవ్.. ఇప్పుడు అకౌంట్ ఇన్‌యాక్టివేట్ అయింది.. రేవంత్ రెడ్డే ఈ ఫేక్ న్యూస్ అకౌంట్లను, మాఫియాను వెనుక నుంచి నడిపిస్తున్నారని ఆరోపించారు. మేము ఈ విషయాన్ని చాలా క్లియర్‌గా పోలీస్ అధికారులకు వివరించాం. సంధ్యారావు బీఆర్ఎస్ అనే అకౌంట్ పేక్ అకౌంట్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
సంధ్య రావు బీఆర్ఎస్ అకౌంట్ రేవంత్ రెడ్డిదే
నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే ఆ అకౌంట్ డిలీట్ అయింది
ఫేక్ న్యూస్ ప్రభుత్వం నడుస్తుందని నిన్న మరోసారి నిర్ధారణ అయింది
ముఖ్యమంత్రి ముందే వెరిఫై చేసుకొని మాట్లాడాలి.. వెరిఫై చేయకుండా ఫేక్ అకౌంట్ తీసుకొచ్చి… https://t.co/AGTZ33zqFC pic.twitter.com/atjTc5stnM
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026