Pawan kalyan | ఈ మధ్య కాలంలో నాకు బాగా ఇబ్బంది కలిగించే అంశం.. మాట్లాడితే మాట్లాడితే ఆంధ్రా ఆంధ్రా అంటున్నారు.. అది నాకు నచ్చడం లేదని జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్ర మీద విద్వేషం లేదన్నారు.
తెలంగాణ ప్రజలు తెలంగాణ ఏర్పాటు కావాలి అనుకున్నారు కానీ.. ఆంధ్ర ప్రజల మీద ఎక్కడ విద్వేషం చూపించలేదన్నారు. నిజంగా విద్వేషం చూపించి ఉంటే ఆంధ్ర ప్రజలు ఒక్కరు కూడా ఇక్కడ ఉండే వాళ్లు కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా 12 ఏళ్లలో ఒక తెలంగాణ నాయకుడిని కూడా విమర్శించలేదన్నారు. నాకు ఈ మధ్యన వస్తుంటే నువ్వు హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతావ్.. నీకు హైదరాబాద్‌లో ఏం పని..? ఇది నేను ప్రత్యేకించి చెబుతున్నా.. నన్ను బెదిరించడానికి మీరెవరు.
బెదిరించేవాళ్లు తెలంగాణ మీ అయ్య జాగీరా..? నా మీద దాడులు చేస్తామంటున్నారు కదా.. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. తెలంగాణలో ఇంక రానివ్వం అంటారు నన్ను. ఆంధ్రాలో అయితే కోనసీమలో కొంతమంది తలతీసేయాలంటారని చెప్పకొచ్చాడు.
మాట్లాడితే ఆంధ్రా ఆంధ్రా అంటున్నారు.. అది నాకు నచ్చడం లేదు
తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్ర మీద విద్వేషం లేదు
తెలంగాణ ఏర్పాటు కావాలి అనుకున్నారు కానీ.. ఆంధ్ర ప్రజల మీద ఎక్కడ విద్వేషం చూపించలేదు
నిజంగా విద్వేషం చూపించి ఉంటే ఆంధ్ర ప్రజలు ఒక్కరు కూడా ఇక్కడ ఉండే వాళ్ళు కాదు
-… https://t.co/3Z4h4PU8nH pic.twitter.com/WKYUOeWqfX
— Telugu Scribe (@TeluguScribe) June 2, 2026
తెలంగాణలో నన్ను అడుగుపెట్టనివ్వను అని బెదిరిస్తున్నారు
తెలంగాణ మీ అయ్య జాగీరా?
– పవన్ కళ్యాణ్ https://t.co/UtjHefblsQ pic.twitter.com/OFabdFlRzb
— Telugu Scribe (@TeluguScribe) June 2, 2026
Priyanka Mohan | ‘మేడ్ ఇన్ కొరియా’ సక్సెస్ ఎఫెక్ట్.. కొరియా టూరిజం అంబాసిడర్‌గా ప్రియాంకా మోహన్!
Pawan kalyan | పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించిన హైకోర్టు