ఈఎస్ఐ దవాఖానపై ఎంపీ వంశీ అబద్ధాలు
ఆ కుటుంబం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పేరు తలువని రోజుండదు. గడ్డం వెంకటస్వామి, గడ్డం వివేక్‌ను దశాబ్దకాలంగా ఆదరిస్తూ.. గత ఎన్నికల్లో వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణకు ఇక్కడి ప్రజలు పట్టంగట్టారు.
- భూకేటాయింపు చేయడం లేదని జిల్లా కలెక్టర్‌పై ఆరోపణలు
- మూడేండ్ల క్రితమే భూకేటాయింపు చేసిన అప్పటి మంత్రి మల్లారెడ్డి
- ప్రస్తుతం టెండర్లు పూర్తయినా ఎంపీకి తెలియని సమాచారం
పెద్దపల్లి, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆ కుటుంబం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పేరు తలువని రోజుండదు. గడ్డం వెంకటస్వామి, గడ్డం వివేక్‌ను దశాబ్దకాలంగా ఆదరిస్తూ.. గత ఎన్నికల్లో వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణకు ఇక్కడి ప్రజలు పట్టంగట్టారు. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లోని కార్మికులపై ఆ కుటుంబానికి ఉన్న నిర్లక్ష్యానికి ఈఎస్ఐ దవాఖాన ఘటన నిదర్శనంగా నిలుస్తున్నది.
రామగుండంలో చాలా ఏండ్ల క్రితం నిర్మించిన ఈఎస్ఐ దవాఖాన శిథిలావస్థకు చేరగా, దాని స్థానంలో నూతన దవాఖాన కోసం బీఆర్ఎస్ హయాంలో అప్పటి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కలెక్టర్ సంగీత సత్యనారాయణ వరుస లేఖలతో అప్పటి కార్మిక మంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పూర్వపు దవాఖాన ప్రాంగణంలోనే కొత్తది నిర్మించాలని నిర్ణయిచి భూకేటాయింపులు చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం రాగా.. ఈఎస్ఐ దవాఖానకు భూకేటాయింపు జరుగలేదని, ప్రస్తుత కార్మిక మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కలెక్టర్ కోయ శ్రీహర్షపై నిందలు మోపి జగన్నాటకానికి తెర తీశారు.
తాజాగా ఈఎస్ఐ దవాఖానకు ఉన్న 3.30 ఎకరాల స్థలంలో నూతన దవాఖాన నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, నిర్మాణ పనులు ప్రారంభించాలని కలెక్టర్‌కు ఈఎస్ఐసీ తాజాగా లేఖ రాసింది. ఇదంతా గత ప్రభుత్వ హయాంలోనే నిధుల కేటాయింపు, టెండర్ ప్రక్రియ పూర్తయిందని తెలుస్తున్నది. ఎంపీ ఈ విషయం తెలుసుకోకుండానే ఇన్నాళ్లూ ఆరోపణలు చేశారనే విమర్శలు ప్రజలనుంచి వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

