‘నామినేటెడ్’ ఊరించుడే!
హోలీకి ముందే.. ఉగాది తర్వాత.. దసరాలోపే.. దీపావళినాడే.. అంటూ కాం గ్రెస్‌లో ఊరించిన నామినేటెడ్ పదవుల భర్తీ మరోసారి వాయిదా పడినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది.
- దీపావళి ఆశలపై నీళ్లు చల్లిన అధిష్ఠానం
- సంక్రాంతికి భర్తీ అంటూ కాంగ్రెస్ లీకులు
- 80కిపైగా పదవుల భర్తీకి ఎదురుచూపులు
- జూలై నుంచి ఖాళీగా 37 కార్పొరేషన్లు
- పూటకో మాట.. పండుగకో గడువు
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): హోలీకి ముందే.. ఉగాది తర్వాత.. దసరాలోపే.. దీపావళినాడే.. అంటూ కాం గ్రెస్‌లో ఊరించిన నామినేటెడ్ పదవుల భర్తీ మరోసారి వాయిదా పడినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, పీసీసీ వరింగ్ ప్రెసిడెంట్లు, డిప్యూటీ స్పీకర్, చీఫ్‌విప్ నియామకాలు తదితర లెక్కలు, సమీకరణాల కారణంగా మరో రెండు నెలల పాటు పోస్టుల భ ర్తీని వాయిదా వేసుకోవాలని ఏఐసీసీ సూచించినట్టు సమాచారం. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ సంక్రాంతికి ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ లీకులు ఇస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.
ఉగాదిలోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో ప్రకటించా రు. ఆ తర్వాత 99 రోజుల ప్రజాపాలన కా ర్యక్రమం, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, బడ్జె ట్ సమావేశాల కారణంగా సాధ్యం కావడం లేదని, ఉగాది తర్వాత నింపుతామని లీకులు వదిలారు. ఏప్రిల్‌లో పదవుల భర్తీ తుది దశకు చేరిందని, రెండు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని గాంధీ భవన్ వర్గాలు ప్రచారం చేశాయి. ‘సర్’ ప్రక్రియ వల్ల అంతరాయం ఏర్పడుతున్నదని, గాంధీ భవన్ చుట్టూ తిరిగేవారికి కాకుండా ‘సర్’ ప్రక్రియలో చురుగ్గా పనిచేసినవారికే పదవులు ఇస్తామని జూలైలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
దీంతో ఆగ స్టు 3 వరకు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడా మాట తప్పారు. సెప్టెంబర్‌లో భర్తీ చేస్తామని, 70- 80 శాతం పదవులు సీనియర్ కార్యకర్తలకే ఇస్తామని మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రకటించారు. దీంతో ఆశావహులు ఢిల్లీ స్థాయి పైరవీల్లో మునిగిపోయారు. తీరా సెప్టెంబర్ కూడా దాటిపోయింది. వెంటనే దసరాకు ముందే అక్టోబర్ 14లోపే అని మహేశ్‌గౌడ్ చెప్పి, మూడు రోజులకే ‘వీలైనంత త్వరగా’ అంటూ మాట మార్చారు. దసరా తర్వాత దీపావళి గడువు పెట్టగా, తాజాగా సంక్రాంతి అంటూ గాంధీ భవన్ వర్గాలు లీకులు వదులుతున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్ వద్దే జాబితా
ఆర్టీసీ, పౌరసరఫరాలు, మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్లు, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, పీసీసీ వరింగ్ ప్రెసిడెంట్లు, మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని నామినేటెడ్ పోస్టుల భర్తీకి అడ్డంపడుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులే చెప్తున్నారు. ఇందులో కొన్ని పదవులు ఎమ్మెల్యేలు, అదే స్థాయి నేతలకు ఇవ్వాల్సి ఉండటంతో హైకమాండ్‌తో మాట్లాడకుండా నిర్ణయించే పరిస్థితి లేదు. 2024 జూలై 7న నియమించిన 37 కార్పొరేషన్ చైర్మన్ల రెండేండ్ల పదవీకాలం 2026 జూలై 8తో ముగిసింది. ఖాళీలు, ఇంకా భర్తీ చేయనివి కలిపి 50కి పైగా ఉన్నట్టు సమాచారం.
పాత చైర్మన్లలో ఆరేడుగురికే మళ్లీ అవకాశం ఉండొచ్చని, 50 మందితో జాబితా సిద్ధమైందని, మరో 30 ఖాళీలతో కలిపి దాదాపు 80 పదవులు భర్తీ కావచ్చని టీ కాంగ్రెస్ లీకులు ఇస్తూ వచ్చింది. అయితే తాజా ఆలస్యానికి ఢిల్లీ పరిణామాలే కారణమని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆశావాహుల జాబితా ఇంకా నిర్ణయం కాలేదని, అది రాష్ట్ర కాంగ్రెస్ వద్దనే పెండింగ్‌లో ఉన్నదని విశ్వసనీయంగా తెలిసింది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నుంచి సామ రామ్మోహన్ రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ నుం చి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఓటర్ల తుది జాబితా డిసెంబర్ 30న వెలువడనున్నది. ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో బీసీ నేతల్లో అసంతృప్తి ఉందని మహేశ్ గౌడ్ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పదవుల పంపిణీ ఓటర్ల సమీకరణాలతో ముడిపడి ఉన్నదని, బీసీలను సంతృప్తిపరచకుండా జా బితా విడుదల చేస్తే మరింత అసంతృప్తి పెరగవచ్చనే ఆందోళన నాయకత్వంలో ఉందన్న ది కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

